05-03-2025 08:03:14 PM
చెన్నై,(విజయక్రాంతి): లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన(Redistribution of Lok Sabha Constituencies)పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil Nadu Chief Minister Stalin) అధ్యక్షతన అఖిలపక్ష భేటీ బుధవారం జరిగింది. ఈ అఖిలపక్ష భేటీకి డీఎంకే, అన్నాడీఎంకే, మరికొన్ని పార్టీ హాజరయ్యాయి. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ... లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు తము వ్యతిరేకం కాదని, ప్రస్తుత జనాభా ప్రకారం పునర్విభజన చేస్తే దక్షిణాదికి నష్ట వాటిలితుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే 1971 జనాభా లెక్కల ప్రకారం ఎంపీ స్థానాలకు పునర్విభజన చేసి 30 ఏళ్లు అమలులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్లమెంటులో హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించడం తగదన్నారు.
పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, అలాగే దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో జేఏసీ ఏర్పాటు చేస్తామని స్టాలిన్ చెప్పారు. తమ డిమాండ్లను ఈ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళ ప్రజలపై ప్రేమ లేదన్నారు. అందుకే బలవంతంగా తమిళిలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల భాషల అభివృద్ధి కోసమే త్రిభాషా సూత్రం అని బీజేపీ చెబుతోందని స్థాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తమిళం, సంస్కృతం భాషలకు నిధుల కేటాయింపులో ఎందుకు వెండి చేయి చూపుతోందని ప్రశ్నించారు.
All Party Meeting In Tamil Nadu On Delimitation