calender_icon.png 27 December, 2024 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

07-11-2024 12:54:31 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ 6: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్నీ సీట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు.

ఇప్పుడైనా బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి న్యాయం చేయాలన్నారు. బీసీలకు ఎవరు సీట్లు ఇస్తే వారినే బీసీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గెలిపించుకుంటారని అన్నారు. బీసీ సంఘం నాయకులు రాజేందర్, వేముల రామకృష్ణ, అనంతయ్య, రాజ్‌కుమార్, భూపేష్ సాగర్, శ్రీనివాస్, శివ, రాందేవ్, జోషి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.