ఏడాదిలో 7 మార్లు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాం
పార్టీలకు అతీతంగా ముందుకు సాగుదాం
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి...
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా మనమందరం ఒకతాటిపైకి వచ్చి అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుదామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రభుత్వ ఎంవిఎస్ జూనియర్ కళాశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతి ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, తరగతి గదిలో పాడైన రేకులను తొలగించి నూతన రేకులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, అవసరమైన తరగతి గదులకు స్లాబ్ లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల ఆవరణలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రెండు పార్కులను, వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం ఎస్టిమేషన్స్ తయారు చేయాలి అని ఆయన ముడా, మున్సిపల్ చైర్మన్ లకు సూచించారు. అలాగే విద్యార్థుల మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన వేదిక దగ్గర షెడ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. మా దృష్టికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని, ఎవరైనా కావాలని తప్పులు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈడబ్ల్యూఐడిసి నిధుల నుంచి అత్యాధునికంగా తరగతి గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతోనే ఏడాదిలోనే ఏడుమార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం డిజిటల్ కంటెంట్ మెటీరియల్స్ ఇస్తే పదవతరగతి లో ఫైనల్ పరీక్షల్లో 23% అధిక ఫలితాలను సాధించడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా డిజిటల్ కంటెంట్ ను మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరిగిందని, ఉపాధ్యాయులకు కూడా ఈ డిజిటల్ కంటెంట్ వినియోగం పైన రెండు రోజులు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చైర్మన్ సాయి బాబా, నాయకులు ఆజ్మత్ ఆలి, ఫయాజ్, జేసిఆర్, ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలన్నదే మా ఆశయం...
ప్రజల సంక్షేమ కోసం ప్రతి పైసా ఖర్చు చేసి వారికి పూర్తిగా ఉపయోగపడేలన్నదే మా ఆశయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ లోని భగీరథ కాలనీ లోపర్యటించి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. భగీరథ కాలనీలో నిర్మాణం చేస్తున్న సెప్టిక్ ట్యాంక్ ఔట్ లెట్ పనులను పరిశీలించారు. భగీరథ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పార్క్ స్థలం లో ముడా నిధులతో పార్క్ నిర్మాణం చేయాలని ముండా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయినా వెంటనే వినియోగం లోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదని, మరింత వేగంగా ముందుకు సాగేందుకు ప్రజలు పూర్తి శాఖలో సహకారం అందించాలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ ప్రశాంత్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.