calender_icon.png 26 January, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కలెక్షన్లు.. అవార్డులు.. రివార్డులన్నీ ఒరిజినల్

24-01-2025 12:00:00 AM

నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు.

జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విజయోత్సవాన్ని అనంతపురం పట్టణంలో అభిమానుల సమక్షంలో నిర్వహించింది. ఈ వేదికపై కథా నాయకుడు బాలకృష్ణ స్వయంగా ‘గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ’ పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఆదిత్య 369’ సినిమాలో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచే ‘డాకు మహారాజ్’ పాత్ర పుట్టింది. కొవిడ్ సమయంలో సాహసించి ‘అఖండ’ సినిమాను విడుదల చేశాం. నా అభిమానులే నా ప్రచార కర్తలు. వాళ్ల కు తెలుసు.. నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్, నా అవార్డ్స్, నా రివార్డ్స్.. అన్నీ ఒరిజినల్ అని” అన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా చిత్ర బృందం కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.