23-04-2025 12:52:05 AM
- నూతన మున్సిపాలిటీలపై గెజిట్ విడుదల
- ఇకనుంచి పంచాయతీలు కనుమరుగు
- పల్లెలకు పట్టణ హోదా
మేడ్చల్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి): మే డ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాగా మారింది. జిల్లాలో మిగిలిన 34 గ్రామపంచాయతీల ను నూతనంగా మూడు మున్సిపాలిటీలు ఏ ర్పాటు చేసి అందులో విలీనం చేయడంతో పంచాయతీ వ్యవస్థ లేకుండా పోయింది. మూడు నూతన మున్సిపాలిటీల కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చే సింది. గెజిట్ విడుదల తో గ్రామపంచాయతీలన్నీ పురపాలక పరిధిలోకి వచ్చాయి.
ఇటీవల అసెంబ్లీలో నూతన మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించి బిల్లుకు ఆమోదం లభించింది. కొత్తగా ఏర్పాటు అయ్యే మున్సిపాలిటీలలో జిల్లాకు చెందినవి మూడు ఉ న్నాయి. మేడ్చల్ మండలంలో కొత్తగా ఎల్లంపేట మున్సిపాలిటీ ఏర్పాటయింది. దీని పరి ధిలో డబిల్పూర్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, నూతనకల్, శ్రీ రంగవరం, బండ మా దారం, లింగాపూర్, రావల్ కోల్, సైదుని గ డ్డ తండా, సోమారం, రాజు బొల్లారం, రాజు బొల్లారం తండా, ఘన్పూర్, ఎల్లంపేట పం చాయతీలను చేర్చారు.
ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఏర్పాటు చేశారు. మూ డు చింతలపల్లి మున్సిపాలిటీలో అబ్రాస్ పల్లి, అనంతరం, జగ్గం గూడ, కేశవాపూర్, కేశవరం, కొల్తూరు, లక్ష్మాపూర్, లింగాపూర్ తాండ, మూడు చింతలపల్లి, నాగిశెట్టిపల్లి, నారాయణపూర్, పోతారం, ఉద్దే మర్రి, పొ న్నాల గ్రామ పంచాయతీలు విలీనం చేశా రు. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఏర్పా టు చేశారు. అలియాబాద్ మున్సిపాలిటీలో అలియాబాద్, లాల్ గడి మలక్పేట్, మజీద్పూర్, మురహరి పల్లి, తురకపల్లి, యాదా రం గ్రామపంచాయతీలు విలీనం చేశారు. అలియాబాద్ మున్సిపా లిటీలో 20 వార్డు లు ఏర్పాటు చేశారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్తులు కనుమరుగు
జిల్లాలో జిల్లా పరిషత్‌తో పాటు, మేడ్చల్, షామీర్పేట్, మూడు చింతలపల్లి, కీసర, ఘట్కేసర్ మండల పరిషత్‌లో ఉం డేవి. పంచాయ తీలన్నీ మున్సిపాలిటీలలో విలీనం చేయడంతో జిల్లా, మండల పరిషత్తులు కనుమరు కానున్నాయి. గతంలో జిల్లాలో 61 గ్రామపంచాయతీలు ఉండేవి. నాలుగు నెలల క్రితం 28 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. కీసర, ఘట్కేసర్ మండలాల్లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనం కావడంతో షా మీర్పేట్, మేడ్చ ల్, మూడు చింతలపల్లి మండలాలకు చెంది న 34 గ్రామపంచాయతీలు మిగిలాయి.
ఇందులో ఒకటి కొత్తగా ఏ ర్పాటయింది. మూడు మండలాలతో జిల్లా పరిషత్ కొనసాగడం సాధ్యం కానందున మిగతా పంచాయ తీలకు కూడా మున్సిపాలిటీలలో విలీనం చేశారు. కొత్త మున్సిపాలి టీల ఏర్పాటుతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 12 కు చేరింది. జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. అంతేగాక జిహెచ్‌ఎంసి పరిధి కూడా మేడ్చల్ జిల్లా వరకు విస్తరించి ఉంది.
పల్లెలకు పట్టణ హోదా
నూతన మున్సిపాలిటీలలో గ్రామ పం చాయతీలను విలీనం చేయడంతో పల్లెలకు పట్టణ హోదా లభించినట్లయినది. చాలా గ్రామాలు పూర్తిగా మారుమూలన ఉన్నా యి. కొత్త మున్సిపాలిటీలలో గ్రామానికి ఒక వార్డు చొప్పున ఏర్పాటు చేశారు. పెద్ద గ్రామాల్లో రెండు, చిన్న గ్రామాలైతే రెండు కలిపి ఒక వార్డు ఏర్పాటు చేశారు.