calender_icon.png 26 October, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రాష్ట బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

23-07-2024 01:45:04 AM

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలన్నీ ఈ బడ్జెట్‌పైనే నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్ట మొదటిసారిగా పూర్తిస్థా యి బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, యువత, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్త లు, కార్మికులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అనేక హామీ లు గుప్తించింది.

ఈ హామీల అమలు కోసం నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటాన్ బడ్జెట్‌లో ఈ వర్గాలందరినీ నిరాశ పరిచిన రేవంత్ సర్కార్.. పూర్తిస్థాయి బడ్జెట్‌లో జరిపే కేటాయింపులపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎలాంటి వరాలు గుప్పిస్తుందోనని సామాన్యులు ఆశగా ఎదురుచూ స్తున్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ పద్దు ఉంటుందా? లేదంటే ఊరించి ఉసూరుమనిపిస్తుం దా? అనే విషయంపై సామాన్యుల నుంచి సంపన్నుల వరకు చర్చించుకుంటున్నారు.