calender_icon.png 4 March, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసీదుల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి..

03-03-2025 07:11:28 PM

ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రంజాన్ పండుగ పురస్కరించుకొని ముషీరాబాద్ డివిజన్లోని పటాన్ బస్తీలో ఏక్ మినార్ మసీదులో మసీదు సభ్యులను కలిసి వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజ్, మంచినీరు, ట్రాఫిక్ సమస్యలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జై సింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్, మజీద్ సభ్యులు చాంద్, శివ ముదిరాజ్, షాయద్ బాయ్, జావిద్ ఖాన్, పర్వేస్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, సర్వర్ జూన్ జాఫర్, సాబీర్, సత్యనారాయణ బాబు, శ్రీకాంత్ యాదవ్, టిల్లు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.