09-12-2024 02:07:25 AM
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఉపాధి పెంచే ఏ పరిశ్రమైనా తమ ప్రభుత్వానికి ముఖ్యమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే ఎక్కువ ఉపాధి లభిస్తుందని, అందులో భాగంగా తెలంగాణలో ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పాలసీని అందుబాటులోకి తీసుకొ చ్చామని స్పష్టంచేశారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబా ద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అందుబాటులోకి తీసుకొచ్చే మీసేవా యాప్, టీఖూనఫైబర్ ప్రాజెక్టు, అడెక్‌ెే్సహెచ్‌డీఎఫ్‌సీ స్మార్ట్ అగ్రి క్రెడిట్, మిత్ర ప్రాజెక్టు సన్మతి కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతోపాటు నాలుగు కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు.
అనంతరం శ్రీధర్‌బాబు మాట్టాడుతూ.. కొత్త ఒరవడి, ఆలోచనా విధానంతో రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటే ప్రగతికి అసలైన నిర్వచనమని, ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని చెప్పారు.
ఏడాది కాలంగా రాష్ట్రంలోని ఎంతో జవాబుదారీతనంతో చేపట్టిన ప్రగతి నివేదికను విజయోత్సవాల సందర్భంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని అగ్రగామిగా నిలపాలనే మా లక్ష్యాన్ని రానున్న నాలుగేళ్లలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
సాంకేతికతతో రైతులకు మెరుగైన సేవలు
వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అడెక్స్ పేరిట ఒప్పందం జరిగిందని తెలిపారు. దీని ద్వారా రుణమాఫీ, మద్దతు ధర, బోనస్ వంటి సమాచారాన్ని అందించడంతోపాటు పనితీరును వేగవంతం చేసేందుకు దోహదపడుతుందన్నారు.
రైతులకు గతంలో 30 రోజులకు కూడా రుణాలు మంజూరు కాని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం రెండు రోజుల్లోనే మంజూరవుతున్నాయని స్వయంగా రైతులే చెప్తున్నారని వెల్లడించారు. డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పమని, ఇందులో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ (టీజీన్యాబ్) ఆధ్వర్యంలో వాట్సప్ ఆధారిత చాట్ అప్లికేషన్ సిద్ధం చేశామన్నారు.
దీని ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. మహిళా సాధికారత పెంపొందించడలో భాగంగా ప్రాజెక్టు సన్మతి పేరిట ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. దీంతోపాటు యువతలో మానసిక ప్రవర్తన సరైన దిశలో పెట్టేందుకు ఉపయోగపడే మిత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.
మీసేవా ద్వారా మరిన్ని సేవలు
మీసేవా ద్వారా మెరుగైన పౌరసేవలు అందించాలని, మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. ప్రజలకు అవసరమైన చాలా ధ్రువీకరణ పత్రాలు ఇకనుంచి మీసేవా ద్వారానే పొందవచ్చని సూచించారు. ఇందుకోసమే గ్యాప్ సర్టిఫికెట్, స్థానికత, మైనార్టీ, ఆదాయ ధ్రువీకరణ, క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ల వంటివి మీసేవా ద్వారానే సులభంగా పొందవచ్చని స్పష్టం చేశారు.
టీగూ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
రూ.4 వేల కోట్ల సబ్సిడీ బకాయిలు
గత ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2023 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి గుర్తుచేశా రు. ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దశల వారీగా పెండింగ్ నిధులను విడుదల చేసి ఎంఎస్‌ఎంఈల నిర్వహకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వారి కోసం మినీ ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దీని కోసం భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామని చెప్పారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో 12 పారిశ్రామికపార్కుల ఏర్పాటు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వీటిలో రూ.1500 కోట్లతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాలు పోటీ పడినా
ప్రపంచస్థాయిలో పేరొందిన లెన్స్ కార్ట్ సంస్థ ఏర్పాటు కోసం దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయని, తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం కారణంగా ఆ సంస్థ తమ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ముందుకు వచ్చినట్టు శ్రీధర్‌బాబు వెల్లడించారు. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సంస్థ ద్వారా 2 వేలకు పైగా ఉపాధి లభిస్తుందన్నారు.
లెన్స్‌కార్ట్ సంస్థ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు వారికి, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ, ప్రీమియర్ ఎనర్జీస్, ఎం/ఎక్స్ ప్రీమియర్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రై.లి కంపెనీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అన్ని రంగాల్లోని పారిశ్రామిక వేత్తల తరఫున ఇచ్చే సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రగతిని ఆపాలని కొందరు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నదని వెల్లడించారు.
శ్రీరాంపూర్, మద్దూర్ గ్రామస్థులతో మంత్రి ముచ్చట
టీఘూ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని ఒక కుటుంబం, గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యాలయం నుంచి కలెక్టర్‌తోపాటు గ్రామస్థులతో మాట్లాడారు. టీ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. దీని ఉపయోగాల గురించి వివరించారు.
నారాయణపేట్ జిల్లా మద్దూర్ గ్రామానికి చెందిన ఒక విద్యార్థినితో కూడా మాట్లాడారు. టీఙూటీఫైబర్ ద్వారా ఇంటి వద్దకే అన్ని సేవలు తీసుకురావడం పట్ల విద్యార్థిని సంతోషం వ్యక్తంచేసింది. చిన్నారిని మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరి అని మంత్రి అడగగా రేవంత్‌రెడ్డి అని సమాధానం చెప్పడం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.