01-03-2025 05:08:55 PM
సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పద్మశాలీలు ఐక్యతగా ముందుకు సాగాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు(Padmashali Sangam District President Irukula Anjaneyulu) అన్నారు. ఈనెల 9న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ(All India Padmashali Mahasabha), 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మా సభలకు సంబంధించిన కరపత్రాలను సంఘ నాయకులతో కలిసి శనివారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరుకుల్ల ఆంజనేయులు మాట్లాడుతూ... 1921 సంవత్సరం లో అఖిల భారత పద్మశాలి సంఘం స్థాపించి ఐక్యతను చాటుతూ దేశంలోనే బలమైన సంఘముగా ముందుకు వెళుతుందన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గదర్శకంలో ఆయన ఆశీస్సులతో ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి ఆధ్వర్యంలో హక్కుల సాధన కోసం అందరం ఏకతాటిపై రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో పద్మశాలీలకు సముచిత స్థానం దక్కేలా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలోని పద్మశాలీలు అత్యధిక తరలి వచ్చి మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సామల రాజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మారిని వెంకటేష్, రాష్ట్ర నాయకులు నల్ల కనకయ్య, గుండా శంకర్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, గౌరవాధ్యక్షుడు లింగయ్య, నాయకులు తిరుపతి, రవీందర్, మోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.