calender_icon.png 23 December, 2024 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ..

22-12-2024 11:09:39 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శాలువాలు, మైసూర్‌సిల్క్, కాంజీవరం, టిష్యూ పట్టు సారీస్, పెన్ కలంకారీ పట్టుచీరలు, మహారాష్ట్ర పైతాని చీరలు, వెంకటగిరి, ఉప్పాడ, మంగళగిరి, సోఫా కవర్లు, చెద్దర్లు, అజ్రాక్ చీరలు కోట కాటన్, సిల్క్, ఎంబ్రాయిడరీ చీరలు, పెయింటింగ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బనారస్ డ్రెస్ మెటీరియల్స్ లాంటి మరెన్నో ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆస్టిన్ టెక్ససస్ నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారులూ కుమారి పూజ, దిశా, నియతిలు తమ ప్రదర్శనలో పుష్పాంజలి, అంబాస్తుతి, పార్కడల్, అదిగో అల్లదిగో, తిల్లాన, గతమోహ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. హైదరాబాద్ మహారాష్ట్రియన్ అసోసియేషన్ అంబరీష్ లాహంకార ఆధ్వర్యంలో డోల్ తాషా (డ్రమ్స్) వాయించి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.