16-12-2024 08:32:58 PM
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ సందర్బంగా చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తి చెక్క విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్లు, వెదురు బుట్టలు, మట్టి పాత్రలతో పాటు, కాశ్మీరీ శాలువాలు, కాటన్ అద్దకం చీరలు, కొటాడోరియా, పోచంపల్లి, వేంకటగిరి, ధర్మవరం, నారాయణపేట, మంగళగిరి, గద్వాల్ పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ శిల్పారామం బజార్ లో ఉంచారు. అనంతరం అనూష శ్రీనివాస్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో గజవదనా బేడువే, కులుకాగా నడవరో, రారవెను స్వరజతి, జతిస్వరం, దశావతార శబ్దం, హిందోళ తిల్లాన మాన్య, నృత్యాలను శ్రీలస్య, హారిక, తన్వి, వైష్ణవి, అధ్య, శ్రీకృతి ప్రదర్శించారు.