సినీ పరిశ్రమలో కాలం, కాస్త అదృష్టం కలిసి రావాలే కానీ హిట్, ఫట్తో సంబంధం లేకుండా అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం రుక్మిణి వసంత్ టైం నడుస్తున్నట్టుంది. ఈ కన్నడ బ్యూటీ ‘బీర్బల్ ట్రైలాజీ కేస్ వెండితెరకు పరిచయమైంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 2023లో వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో మాత్రం ఆమె పేరు కాస్త గట్టిగానే వినిపించింది.
ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం ద్వారా రుక్మిణి ప్రేక్షకులను పలకరించారు. సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే దక్కించుకోలేదు కానీ అమ్మడికి మాత్రం బాగా కలిసొచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన అవకాశాలను కొట్టేశారు. రిషబ్ శెట్టి హీరోగా రూపొందుతున్న ‘కాంతారా’ సీక్వెల్లో రుక్మిణి హీరోయిన్గా నటిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న చిత్ర అవకాశం రుక్మిణినే వరించినట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళ్లోనూ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ రుక్మిణి కథానాయికగా నటిస్తోంది. రుక్మిణి అవకాశం కొట్టేసిన ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం.