కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ట్వీట్
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్న వారంతా ఫేక్ న్యూస్ పెడ్లర్లేనని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యద ర్శి సుప్రియా శ్రీనేత్ ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వీడియోను బండి బుధవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తెలంగాణ మహిళలు కాంగ్రెస్ సర్కారు నుంచి ఒక్కటం టే ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని అన్నారు. అలాగే మహిళలకు సాధికారత కల్పించాల్సింది పోయి వారిపైనే దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇళ్లను కూల్చివేయడం, కూరగాయల వ్యాపారులను రోడ్డున పడేయటం, గర్భిణులను బలవంతంగా వీధు ల్లోకి నెట్టడం వంటివి చేశారని మండిపడ్డా రు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో లైంగికదాడి కేసులు 28.94 శాతం పెరిగాయని, మహిళల హత్యలు 13 శాతం, కిడ్నాప్‌లు 26 శాతం పెరిగాయని ఆరోపించారు. మహిళలపై దౌర్జన్యాలు 8 శాతం పెరిగాయన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన భద్రత ఎక్కడని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో 10 వేల మందికి పైగా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారన్నారు. కాంగ్రెస్ దోపిడీదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలు గౌరవం, భద్రత, మద్దతుకు అర్హులని.. కన్నీళ్లు, భయాలు, ద్రోహాలకు కాదని స్పష్టంచేశారు.