- భారత్ సెమీస్ చేరేది అనుమానమే?
- నేటి మ్యాచ్‌పై ఆధారపడ్డ భవిష్యత్
- మహిళల టీ20 వరల్డ్‌కప్
షార్జా: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 9 పరుగుల తేడాతో పరాజ యం పాలయింది. చివరి వరకు పోరాడినా కానీ భారత్‌కు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్..
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. చేధనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులు మాత్రమే చేసి విజయానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సోఫీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
దాయాది మీదే ఆశలన్నీ..
దాయాది పాకిస్తాన్ నేడు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ న్యూజిలాండ్ విజయం సాధిస్తే నెట్న్‌ర్రేట్‌తో పనిలేకుండా న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కానీ ఒక వేళ న్యూజిలాం డ్ ఓడిపోతే మాత్రం నెట్న్‌ర్రేట్ కీలకం అవుతుంది. నాలుగింట రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్లుగా భారత్, న్యూజిలాండ్, పాక్ నిలుస్తాయి. అప్పుడు నెట్న్‌ర్రేట్ మెరుగ్గా ఉన్న జట్టు ఆసీస్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.
సరిపోని హర్మన్ పోరాటం..
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54*) ఒంటరి పోరాటం చేసినా కానీ భారత్ మాత్రం గెలవలేకపోయింది.