తెలంగాణ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా 28 యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్(సమీకృత) స్కూళ్లను ఏర్పాటు చేయడం పేద, మధ్య తరగతి విద్యార్థులకు నిజంగా ఓ వరమనే చెప్పా లి. అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల తల్లిదండ్రులు పేదరికం వల్ల లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో చెల్లించితమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి స్థోమత లేక అవేదన వ్యక్తం చేసేవారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రె స్ సర్కార్ వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యా, వైద్యం ఉచితంగా అందించడానికి అనేక ప్రణాళికలు రూపొ ందిస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీస్ గురుకులాల పేరిట విభజించి విద్యార్థి దశలోనే వారి మనస్సులో కుల, మత బీజాలు నాటింది.
ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య పేరిట అద్దె భవనాలలో గురుకులాలు ప్రారంభించింది. గురుకులాల భవనాల యజమానులు గురుకులాలు ఖాళీ చేయాలనీ లేదా అద్దె చెల్లించాలని షరతు విధించడంతో దసరా సెలవులు ముగించుకొని గురుకులాలకు వెళ్ళిన విద్యార్థులకు తాళం వెక్కిరించింది.
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకులాలు ప్రారంభిస్తే 662 గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వాటిలో బీసీ గురుకులాలు 306 , ఎస్సీ గురుకులాలు 135, ఎస్టీ గురుకులాలు 42,మైనారిటీల గురుకులాలు ఉన్నాయి. విద్యార్థులకు చిన్నప్పుడు కుల, మత, ప్రాంత, భాష, వర్గ, వర్ణ బేధా లు ఏమీ ఉండవు.
గత ప్రభుత్వం కుల, మతాలను ప్రోత్సహిస్తూ గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ,చేపల పంపీణీ,పందుల పెంపకం, గౌడన్నలకు తాళ్ళు (తాటి చెట్లు, ఈత చెట్లు) గీయడానికి ప్రాధాన్యత ఇస్తూ కులాలను పెంచి పోషించింది.కుల రహిత, మత రహిత సమాజం నిర్మించాలని అంటూనే గత సర్కార్ కులాల పేరిట, మతాల పేరిట ప్రజలను విభజించడం ఆందోళన కరమైన విషయం.
శ్రీకారం చుట్టిన పీవీ
కుల, మతాలకు అతీతంగా సమైక్యాంధ్రలో అప్పటి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గురుకులాలు ప్రారంభించి ప్రత్యేకం గా గురుకులాల సొసైటీని ఏర్పాటు చేశా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పేదల పాలిట కల్పతరువులుగా ఉన్నాయి.
ప్రభు త్వ గురుకుల పాఠశాలలో చదివిన ఎంతో మంది కలెక్టర్లు గా, పోలీసు ఉన్నతాధికారులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయ మూర్తులుగా, శాస్త్రవేత్తలుగా ప్రతి రంగం లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుత విద్యా శాఖ కార్యదర్శి,బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురుకులం విద్యార్థే.
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( ఎస్‌సీఈఆర్‌టి) డైరెక్టర్ రమేష్ రాష్ట్ర విశ్రాంత పోలీసు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ( డీజీపీ ) మహేందర్ రెడ్డిసహా ఎంతో మంది దేశ, విదేశాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు.
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం లోని సర్వేల్‌లో అప్పటి విద్యాశాఖమంత్రి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా 1971 నవంబర్ 23 న తొలి గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. గురుకుల పాఠశాల ప్రారంభం అయి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంకా అనేక మంది పూర్వవిద్యార్ధులు పాల్గొని తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.
టెన్త్‌లో ర్యాంకులన్నీ ఈ స్కూళ్లకే..
సర్వేల్ గురుకుల పాఠశాల సాధిస్తున్న ఫలితాలను చూసి రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తాటికొండ, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ , మొదలైన ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. 1983 నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 43 గురుకుల పాఠశాలలకు అనుమతి ఇచ్చింది. అదే నెలలోనే హైదరాబాద్ జిల్లాలోని ముషీరాబాద్‌లో గురు కుల పాఠశాల ప్రారంభించారు.
విద్యార్థినుల కోసం సిఖ్ విలేజ్ లో గురుకుల పాఠశాల ప్రారంభించారు. ప్రస్తుతం ముషీరాబాద్ గురుకుల పాఠశాల బోరబండలో ఉంది. రాష్ట్రంలోని విద్యార్థులం దరూ ఈ పాఠశాలల్లో చదవడానికి అర్హులు. గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తారు. గతంలో పదవ తరగతి లో పదికి పది ర్యాంకులు గురుకుల పాఠశాల విద్యార్థులవే.
ఆ తర్వాత ఉపాధ్యాయుల కొరత, నారాయణ, చైతన్య వంటి కర్పొరేట్ స్కూళ్లు, కాన్వెంట్ స్కూళ్లు , క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు, నవోదయ పాఠశా లలు, పబ్లిక్ స్కూళ్లు, సైనిక్ స్కూల్స్ వచ్చా యి. అయినప్పటికీ గురుకుల పాఠశాలలు పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం సాధిస్తున్నాయి. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోబీసీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు.
కోటి ఆశలతో నిరుద్యోగులు
తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పూర్వ (మాజీ) సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొని రావడానికి ,పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయడానికి గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. గురుకులాలకు సొంత భవనాలు నిర్మించక పోవడం వల్ల వాటి భవిష్యత్తు ప్రశ్నార్థ కంగా మారింది.
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కల లు సాకారం చేసుకోవడానికి గురుకుల పాఠశాలలు చక్కగా తోడ్పడుతు న్నవి. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్‌కు కామన్ ఎంట్రన్స్ నిర్వహించడం వలన కొంత మంది నాలుగు పోస్టులకు అర్హత సాధించారు. ఉన్నత పోస్ట్ అయిన డిగ్రీ కళాశాల లెక్చరర్లు గా చేరితే మిగతా పోస్టులు అలాగే మిగిలి పోయాయి.
సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు వెలువరిస్తూ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలలో తర్వాత మెరిట్ అభ్యర్థులను తీసుకోవాలని చెప్పిం ది. అనేక మంది గురుకుల సొసైటీ పరీక్షలలో మెరిట్ సాధించినా ఉద్యోగాలు రాని నిరుద్యోగ ఉపాధ్యాయులు సచివాలయం చుట్టూ, తెలంగాణ రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా దాదాపు 50 వేల మందికి పైగా కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వడం, పదోన్నతులు కల్పించడం, బదిలీలు చేయడం తో ప్రయోజనం పొందారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండడం విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల గురుకుల నిరుద్యోగ ఉపాధ్యాయులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
రేవంత్ సర్కార్ ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు స్వంత భవనాలలో నిర్మించాలనుకోవడం పేద, మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ ఒకే దగ్గర బోధించాలని కోరుకో వడం చారిత్రాత్మక నిర్ణయం.
పేద,మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యాపరంగా ఉన్నత స్థాయిలో నిలపాలని చూస్తు న్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సర్కారును తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి. గురుకులాలలో ఉపాధ్యా యుల కొరత లేకుండా, అన్ని గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించా లని కోరుకొంటున్నారు.
డా. ఎస్. విజయ భాస్కర్
సెల్ : 9290826988