13-03-2025 12:50:47 AM
హైదరాబాద్, మార్చి 12(విజయక్రాంతి): అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్‌లో కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉందని ఎద్దేవా చేస్తూ తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటి నుంచి పచ్చి అబద్ధాలు, అసత్యా లను చెప్పించి ఆయన్ను మోసం చేసిందన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రసంగంలో హామీ ఇవ్వకపోడం ప్రభుత్వ అప్పులపై కేటీఆర్ మండిపడ్డారు. తమ విధానాల వల్ల వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం సాధించిందన్నారు. అయితే ఆ ఘనతను రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.
నో విజన్, ఓన్లీ కమీషన్
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు 20 శాతం కమీషన్ మీద మాత్రమే దృష్టి పెట్టిందని ఆరోపించారు. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం చాంబర్ ముందు ధర్నా చేయడమే దీనికి నిదర్శనమన్నారు.
కమీషన్ ద్వారా వచ్చిన డబ్బులను ప్రభుత్వం ఢిల్లీకి పంపుతోందన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ 25 శాతానికి మించి జరగలేదని కేటీఆర్ అన్నారు. ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తామని సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
రాష్టానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రభు త్వం సచివాలయంలో ఏర్పాటు చేసిన కాం గ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాల ను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గాంధీభవన్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు.