calender_icon.png 19 November, 2024 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని సరుకులూ ఇవ్వాలి

30-07-2024 12:00:00 AM

పేదవారికి నిత్యావసర సరుకులు అందించి ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన చౌకధర దుకాణాలలో ప్రస్తుతం చాలా ప్రాంతాలలో బియ్యం మాత్రమే ఇస్తున్నారు. చింతపండు, కారం, ఉప్పు, గోధుమలు వంటి తొమ్మిది నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. చాలామంది బహిరంగ మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేక పోతున్నారు. మిగతా సరుకులు ఇవ్వని కారణంగా అనేకమంది పస్తులు వుండే పరిస్థితి ఏర్పడుతున్నది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పామాయిల్, కందిపప్పు, గోధుమల సరఫరా నిలుపు చేశారు. రేషన్ సరుకులపైనే ఆధారపడేవారు అర్ధాకలితో అల్లాడవలసి వస్తున్నది. ఇకనైనా, ప్రభుత్వం స్పందించి చౌకధర దుకాణాలలో ఎప్పటిలాగే అన్ని సరుకులు పంపిణీ చేయాలి.

 అల్లాడి సంధ్య, నాగర్ కర్నూల్ జిల్లా