calender_icon.png 26 February, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపు సినిమాకు అన్నీ గుడ్ వైబ్సే

20-02-2025 12:00:00 AM

నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో ఒకరిగా ఆమని, ‘బలగం’ సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ -డ్రామా ‘బాపు’.  దయా దర్శకత్వంలో రాజు, సీహెచ్ భానుప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న రిలీజ్ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్స్ నాగ్‌అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్ట ర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘సినిమా టాక్ బావుంటే మన తెలుగు ఆడియన్స్ సెకం డ్ డే నుంచి హౌస్ ఫుల్ చేస్తారు. ఈ సినిమాకు అన్నీ గుడ్ వైబ్స్ ఉన్నాయి’ అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘ముప్పు ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా దాచుకున్న బ్రహ్మాజీ అన్న తెల్లజుట్టు ఈ సినిమాలో కనిపించింది (నవ్వుతూ).. అంత నేచురల్‌గా చేశారు’ అని చెప్పారు. డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ.. ‘చిన్న, సినిమా పెద్ద ఉండదు.. మంచిది ఏదైనా పెద్ద సినిమానే’ అని తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. “బాపు’ ట్రైలర్‌లో డైరెక్టర్ హీరోలా కనిపించారు” అన్నారు.

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి ఇస్తానని చెప్పారు. ప్లీజ్ అందరూ థియేటర్లకు వెళ్లి మా రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి (నవ్వుతూ)’ అన్నారు. చిత్ర దర్శకుడు దయా మాట్లాడుతూ.. ‘ప్రివ్యూస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు.

నిర్మాత భానుప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఇంత అద్భుతమైన సినీ ప్రముఖులతో వేదిక పంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. నటుడు బలగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. “బలగం’తో ఆదరించారు. ఇప్పుడు ‘బాపు’తో వస్తున్నాం. ఈ సినిమా పది మందికి చూపించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

ధన్య  మాట్లాడుతూ.. “బాపు’ నా కెరీర్‌లో మర్చిపోలేని సినిమా. ఫస్ట్ టైం మా బాపు ఫోన్ చేసిన నేను చాలా గర్వంగా ఉన్నానని చెప్ప డం ఆనందాన్నిచ్చింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఈ సినిమా నా కెరీర్‌లో బిఫోర్ బాపు ఆఫ్టర్ బాపు అన్నట్టుగా ఉంటుంది’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.