రైతు సంఘం డిమాండ్
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఖమ్మం, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రైతులకు రుణమాఫీ చేసి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రైతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాం గ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బాధ్య త తీసుకుని, జిల్లాలోని రైతులందరికీ రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. జిల్లాలో ఇంకా లక్షా 25వేల మందికి పైగా రుణమాఫీ కాలేదన్నారు. జిల్లాలో 1262, 1271 రకాల సన్న వడ్లను కొనడం లేదన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం పాల్గొన్నారు.