calender_icon.png 30 April, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

29-04-2025 11:24:21 PM

డాక్టర్ విశారదన్ మహారాజ్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆరోపించారు. ప్రభుత్వమే రైతులను ఆత్మహత్యకు ప్రేరేపించి చంపుతుందని మండిపడ్డారు. లక్ష కిలోమీటర్ల మన భూమి రథయాత్రలో భాగంగా వారం తలమడుగు మండలంలో పర్యటించారు. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్న ఇటీవల పంట దిగుబడి రాక, ప్రభుత్వం రుణమాఫీ జమ చేయకపోవడంతో అప్పుల బాధతో ఇటీవల తన పంట చేనులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వారి కుటుంబ సభ్యులను ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సమస్యలను వెంటనే ప్రభుత్వం తీర్చాలని, రుణమాఫీ, రైతు ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి అందజేసి అదుకోవలన్నారు. కుటుంబలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్, గ్రామస్తులు మగ్గిడి ప్రకాష్, మండల అధ్యక్షులు నవీన్, నాయకులు గంగన్న రామచందర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.