calender_icon.png 25 January, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత హత్యలే...

25-01-2025 01:26:45 AM

బీఆర్‌ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ 

ఆదిలాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): పంట సాగుకు చేసిన అప్పులు చెల్లించలేక.. రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత హత్యలేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ ఆధర్యంలో తొమ్మిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, సభ్యుల్లో మాజీ మంత్రులు జోగు రామన్న, సత్యవతి రాథోడ్, పువాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటి రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్ ఉన్నారు. రైతు ఆత్మహత్యలపై అధ్యయనంలో భాగంగా మొదటి పర్యటనను శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యువరైతు ఆడేగజానంద్ కుటుంబాన్ని పరామరించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మృతుని కుటుంబ సభ్యులకు రూ.లక్ష సాయం అందించారు.

ఆ తర్వాత బేల మండలం రేణిగూడ గ్రామంలో బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు రాథోడ్ దేవ్‌రావ్ కుటుంబాన్ని పరామరించారు. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జోగు రామన్న రూ.లక్ష సహాయాన్ని అందజేశారు. వారివెంట స్థానిక నాయకులు ఉన్నారు.