calender_icon.png 12 February, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటింగ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలి

12-02-2025 12:00:00 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు అహ్మద్ నదీమ్ 

నల్లగొండ, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు, రాష్ర్ట పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ అన్నారు.

మంగళవారం నల్లగొండ కలెక్టరేట్‌లో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు ఆయన హాజరై అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టే ఆర్జాల బావి సమీపంలోని గోదామును పరిశీలించారు.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్లకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్  జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్చార్జి డీఆర్డీఓ వై .అశోక్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.