13-02-2025 12:07:13 AM
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
నల్లగొండ, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో జరుగుతున్న పలు పనులను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీబీనగర్- గుంటూరు మార్గంలో అదనపు రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు. స్టేషన్‌లో నిర్మిస్తున్న ప్లాట్‌ఫాం, టికెట్ బుకింగ్ కౌంటర్, పార్సిల్ వాహనాల స్థలాన్ని పరిశీలించారు.
ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ మరింత కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఆయన వెంట రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణా, సీనియర్ డీసీఎం ప్రదీప్, డీఓఎం దినేష్‌కుమార్, స్టేషన్ సూపరింటెండెంట్ తారకేశ్వర్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ సతీశ్ తదితరులున్నారు.