బీఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ హామీలన్నీ బోగస్ అని, రైతులు.. ప్రజలను ప్రజా ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, రాం బాబు యాదవ్ ఆరోపించారు. ఎగవేతలు, కోతలు తప్ప కాంగ్రెస్ చేసిం దేమీలేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. జనవరి 26, రాజ్యాంగాన్ని అపహస్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్రచేస్తోందని వాపోయా రు.
తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి తెలంగాణలో అమలు చేసిన హామీలను ఢిల్లీలోనూ అమలు చేసే బాధ్య త హాస్యాస్పదమన్నారు. హామీల అమలుపై దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలతో పాటు దేవుళ్లను మోసం చేసిన చేసిన ఘనత రేవంత్ సర్కార్‌కే చెందుతుందన్నారు. 100 రోజుల్లోనే కాదు 400 రోజులైనా హామీలను అమలు చేయకుండా, రాజ్యాంగం అమల్లోకొచ్చిన జనవరి 26న అమలు చేస్తా మంటూ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారన్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.