calender_icon.png 28 November, 2024 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన సర్వేలో అన్ని వర్గాలు పాల్గొనాలి..

05-11-2024 03:23:24 PM

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 6 వ తారీకు నుండి చేపట్టే కులగణన సర్వేలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పిలుపునిచ్చారు. మంగళవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలు రూపుమాపాలని, రానున్న రోజుల్లో చట్ట సభల్లో జనాబా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలన్న రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా చేపట్టే ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని, దీనికి పట్టణ, మండల కాంగ్రెస్ కార్యకర్తలు సర్వే సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యాయవాది అయితా గంగాధర్, బట్టు మురళి నాయక్, కోర్డినేటర్ బద్ది కిషోర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పెంకి శ్రీనివాస్ రావు, రూరల్ ఓబీసీ అధ్యక్షులు కట్టా సోమయ్య, పట్టణ ఓబీసీ అధ్యక్షులు చారి, రాము నాయక్, మైనారిటీ నాయకులు చాంద్, ఇమ్మానుయేల్, సాంబయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్, కాంగ్రెస్ సోషల్ మీడియా కోర్డినేటర్ షేక్ షఫీ పాల్గొన్నారు.