calender_icon.png 18 January, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులన్నీ నేడు విచారణ

11-07-2024 02:44:05 AM

ప్రకటించిన హైకోర్టు

తాజాగా సజ్జల, ఆళ్ల పిటిషన్లు

విజయవాడ, జూలై 10 (విజయక్రాంతి): గుంటూరు జిల్లా మంగ ళగిరి మండలం ఆత్మకూరులోని టీడీపీ ఆఫీసుపై 2021లో జరి గిన దాడి కేసులో తమకు ముంద స్తు బెయిల్ మంజూరు చేయాలం టూ పలువురు వైసీపీ అగ్రనేతలు దాఖ లు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేయనుంది. వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా చేసి న సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజా గా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాశ్ దాఖలు చేసిన పిటి షన్లతో కలిపి సజ్జల, ఆళ్ల పిటిషన్లను గురువారం విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృపాసాగర్ వెల్లడించారు. అప్పిరెడ్డి, రఘురాం, అవినాశ్‌ల వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగానే వాళ్ల తరఫు సీనియర్ అడ్వొకేట్ పొన్నవోలు సుధా కర్‌రెడ్డి కల్పించుకుని, సజ్జల, ఆళ్ల పిటిషన్లను కూడా జత చేసి విచారణ జరపాలని కోరారు. అందుకు అనుమతించిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.