calender_icon.png 30 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయాలి

30-10-2024 02:12:00 AM

  1. తప్పు చేయడం వల్లే రాజ్ పాకాల పారిపాయారు
  2. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు బయటపడిన ప్రతీసారి బీఆర్‌ఎస్ నాయకులు బయటికి వచ్చి మాట్లాడతున్నారని, ముందుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరికి డ్రగ్స్ చేయాలని పోలీసులకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

మంగళవారం ఆయన గాంధీభవన్‌లో  ఫహీం ఖురేషి, సత్తు మల్లేశ్ తదితరులతో కలిసి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ముందు కొచ్చి డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఘటన లో రాజ్‌పాకాల, విజయ్ మద్దూరిని కేటీఆర్ వెనుకేసుకురావడం సిగ్గు చేట ని ధ్వజమెత్తారు.

కేటీఆర్‌కు అసలు బీనామి విజయ్ మద్దూరేనని, అందు కే కేటీఆర్ ఎంతో ఆరాటపడుతున్నార ని విమర్శించారు. జన్వాడ ఫామ్‌హౌస్ అంటేనే వివాదాలకు నిలయంగా మా రిందని అన్నారు. ఓసారి దీపావళి ఫెస్టివల్, ఇంకోసారి గృహప్రవే శం అం టున్నారని, వాళ్ల మాటల్లోనే  స్పష్టత లేదని విమర్శించారు.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు డ్రగ్స్ ను ప్రేరేపించాలని చూస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. రాజ్ పాకాలనే డ్రగ్స్ ఇచ్చారని విజయ్ మద్దూరు మొ దటగా ఒప్పుకుని ఇప్పుడు మాట మా రుస్తున్నాడని   చెప్పారు.  డ్రగ్స్‌కేసు విషయంలో డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.