calender_icon.png 14 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వ బాహ్మణులంతా ఒకే కులం

07-11-2024 12:31:41 AM

స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు గోపినాథ్ 

వనపర్తి, నవంబర్ 6 (విజయక్రాంతి): విశ్వ బ్రాహ్మణులంతా ఒకే కులమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఫారంలో ఉన్న తప్పులను సవరించాలని స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు గోపినాథ్ కోరారు. విశ్వ బ్రాహ్మణులు / విశ్వకర్మగా పిలిచే కులంలో వృత్తులు పలు రకాలుగా ఉన్నప్పటికీ కులమంతా ఒకటే నని..

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న బీసీ కుల గణనలో సీరియల్ నంబర్ 75 నుంచి 79 వరకు ఉన్న క్రమ సంఖ్యలో కుమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణ శిల్పులు వేర్వేరు కులాలుగా చూపించడం తప్పని అన్నారు. క్రమ సంఖ్య అందరికి ఒకటే చూపించి, వృత్తులను కులా లుగా చూపించడం సరికాదని చెప్పా రు. ఇలాంటి చర్యలతో భవిష్యత్ తరాల వారికి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.