calender_icon.png 10 January, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కమిషన్ పర్యటనలో బీసీలంతా పాల్గొనాలి

28-10-2024 12:57:50 AM

జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సోమవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమయ్యే బీసీ కమిషన్ పర్యటనలో బీసీలు పాల్గొని తమ వాణిని కమిషన్‌కు వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయి లో బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు, బీసీ డిమాం డ్లను వినతిపత్రాల ద్వారా కమిషన్ దృష్టికి తీసుకెళాలని కోరారు.

రాష్ట్రం లో ప్రస్తుతం బీసీ కమిషన్ చేసే పర్యటన అత్యంత కీలకమైనందున ఈ పర్యటనలో పాల్గొని బీసీ మేధావులు, ఉద్యోగులు, విద్యార్థి, యువజన, మహిళా నాయకులు జిల్లాల్లో బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు కొనసాగే బీసీ కమిషన్ పర్యటనను విజయవం తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.