మంచిర్యాల, (విజయ క్రాంతి) : మంచిర్యాల సమీపంలోని క్వారీలో ఈనెల 21న జరుగనున్న దుర్గాదేవి జాతరకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారి దర్శనంకు వీఐపీ మార్గం లేదని అన్నారు. అలాగే వెహికిల్ , దర్శనం టికెట్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్, గడ్ పూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.