20-03-2025 11:10:01 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రంలో మొత్తం 254 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9:35 వరకే మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులు ఎవరినీ అనుమతించడం జరగదు. ఇట్టి పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్ గా రమణారావు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా రాందాస్ వ్యవరించనున్నారు. పరీక్షలు విద్యార్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... పిల్లలు తొందరపాటుతో కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.