calender_icon.png 18 January, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

17-01-2025 11:16:44 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో నవోదయ పరీక్ష నిర్వహణకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత తెలిపారు. ఈనెల 18న నవోదయ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష ఏర్పాట్లను ముమ్మరం చేపట్టినట్లు శుక్రవారం డీఈఓ వివరించారు. ఉమ్మడి జిల్లా నుంచి 5,191 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. వారి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఆదిలాబాద్ జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా చేశామని, అందులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూడు, బోథ్, ఉట్నూర్ లలో ఒక్కోటి చొప్పున పరీక్ష కేంద్రలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.