calender_icon.png 15 November, 2024 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

15-11-2024 02:56:54 PM

ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన అధికారులు

కరీంనగర్ (విజయక్రాంతి): ఈనెల 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ (స్థానిక సంస్థలు) పేర్కొన్నారు. జిల్లాలోని 56 కేంద్రాల్లో 26,415 మంది పరీక్ష రాయనున్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రశ్నాపత్రాలను ఉన్నతాధికారుల సమక్షంలో భద్రపరిచారు. అనంతరం పకడ్బందీగా సీలు వేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాగులను లోనికి అనుమతించమని పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం కారణంగా మెహందీ, టాటూలు పెట్టుకోవద్దని సూచించారు. వారి వెంట ఆర్డీవో మహేశ్వర్, సూపరింటెండెంట్ కాళి చరణ్, పలువురు అధికారులు ఉన్నారు.