ముంబై: శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోయిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. లంకలో టర్నింగ్ పిచ్‌లకు అనుగుణంగా బ్యాటర్లను ఎంపిక చేయాలన్న దానిపై రోహిత్ స్పందించాడు. ‘టర్నింగ్ పిచ్‌ల కోసం బ్యాటర్లను ప్రత్యేకంగా ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. శ్రీలంక పిచ్‌లపై విభిన్న షాట్లు ఆడాలని ప్రయత్నించి విఫలమయ్యాం. మా కంటే శ్రీలంక స్పిన్నర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. కొత్తగా ప్రయత్నిస్తే ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బ్యాటర్లు చాలా మంది స్లో పిచ్‌లపై ఆడినవారే. నాణ్యమైన క్రికెటర్లే. ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు.
ఈ సిరీస్ ఓటమి గురించి అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని రోహిత్ తెలిపాడు. కాగా శ్రీలంక చేతిలో అనూహ్య పరాభవం భారత క్రికెట్‌కు పాఠాలు నేర్పింది. లంక స్పిన్‌తో మనల్ని తిప్పేసి సిరీస్ ఎగరేసుకుపోయింది. దీంతో అంతా టర్నింగ్ పిచ్‌లకు తగినట్లు బ్యాటర్లను ఎంపిక చేయాలని డిమాండ్‌లు వినిపించాయి. లంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 2 గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్‌ను మాత్రం 0 ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. దీంతో కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు తొలి అడుగు అంతగా కలిసిరాలేదని చెప్పొచ్చు. ఇక సెప్టెంబర్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానుంది.