calender_icon.png 1 March, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెన్యా సహకార సంఘాన్ని సందర్శించిన అల్గిరెడ్డి

01-03-2025 01:29:18 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 28: కెన్యా దేశంలో రైతు సహకార సంఘాల పనితీరు, సంఘ అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను ముల్కనూర్ సహకార గ్రామీణ రైతు సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి పరిశీలించారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు కెన్యా దేశంలోని మోంబస నగరంలో ఎన్సీడీసీ జనరల్ కార్యనిర్వాహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్సీడీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. సహకార రంగంలో మరింత వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న ముల్కనూర్ సహకార గ్రామీణ రైతు బ్యాంకు రైతుల అభ్యున్నతి కోసం చేపడుతున్న పథకాల గురించి ప్రవీణ్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  వివరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్రెడ్డిని జ్ఞాపికతో సన్మానించారు. సమావేశంలో ఎన్సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కుమార్ బన్సల్, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘానీ  తదితరులు పాల్గొన్నారు.