calender_icon.png 22 March, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

22-03-2025 01:10:54 PM

అకాల వర్షాలకుపంట నష్టపోయిన రైతులకు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భరోసా

కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులు అధైర్య పడోద్దని ప్రభుత్వం ఆదుకుని అండగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి(Alphores Narender Reddy) స్పష్టం చేశారు.. శనివారం కొత్తపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షం ముంచెత్తి మొక్కజొన్న,మామిడి పంటతో పాటు కూరగాయల పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని చాలాచోట్ల వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యము కొట్టుకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని.. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పరిహారం అందే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. కొత్తపల్లి మండలంలో 200ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయబడిందని కొన్నిచోట్ల పంటను రైతులు హా ర్వెస్టింగ్ చేశారని నిన్న కురిసిన అకాల వర్షానికి సుమారు 50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.. మొన్నటి వరకు నీటి ఎద్దడితో వరి పంటకు నష్టం వాటిల్లిందని మరో 10 రోజుల్లో చేతికి వచ్చే మొక్కజొన్న పంట ప్రకృతి కన్నెర్ర చేయడంతో గాలివాన బీభత్సానికి మొక్కజొన్న సైతం నేలవాలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. కరీంనగర్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలకు అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహారం ఇప్పించేందుకు కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

గత ప్రభుత్వాలు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పట్టించుకోలేదని కేవలం పర్యటనలకే పరిమితమై హామీలు ఇచ్చి ముఖం చాటేసారని ఎద్దేవ చేశారు రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.. అకాల వర్షాలతో కౌలు రైతు విలవిలలాడుతున్నాడని ఎకరాకు 25000 కౌలు చెల్లించడంతోపాటు 40,000 వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయారని ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ రెడ్డి , కొత్తపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు దుబ్బాసి కుమార్ మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనక రెడ్డి కొత్తపల్లి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జేరిపోతుల వాసు చిట్కూరి బీరయ్య బేతిసుధాకర్ రెడ్డి వెన్నం రజిత రెడ్డి సంధి తిరుపతిరెడ్డి కాశెట్టి శ్రీనివాస్,జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వెన్నం రజిత రెడ్డి  మాడుగుల మమత, శ్రీమతి రెడ్డి,చెప్యాలరాజిరెడ్డి, సిరి శెట్టి రాజేష్  తదితరులు పాల్గొన్నారు