calender_icon.png 18 April, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళకు వన్నె తెచ్చిన ఆల్ఫోర్స్ గర్ల్ ్స ఇ-టెక్నో స్కూల్

03-04-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్2 (విజయక్రాంతి): కరీంనగర్ లో ‘ప్రథమోత్సవ్‘  పేరుతో నిర్వహించినటువంటి అల్ఫోర్స్ గరల్స్ ఇ-టెక్నో స్కూల్  వార్షికోత్సవ వేడుకలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా సాధన చేస్తూ విశ్లేషిస్తూ వివిధ విషయాలలో పట్టు సాధించి సమాజంలో అత్యుత్తమంగా స్థిరపడాలని సూచించారు.

  తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విశేషంగా కృషిచేసి వారికి మంచి పేరు తీసుకురావాలని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో గత 35 సంవత్సరాలుగా  విద్యారంగా అభివృద్ధికై ఎనిలేని కృషి చేస్తున్నదని మరియు విద్యార్థులకు అన్ని రకాలుగా వసతులను కల్పించి విజేతలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పారు. ప్రతి విద్యార్థి సమాజంలో పై చేయి సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు.

వార్షిక ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు నిర్వహించినటువంటి వివిధ పోటీ పరీక్షలలో , ప్రతిభాపాటవ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించి పలు సాంప్రదాయ నృత్యాలు,  సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆలోచింపచేసాయి.