27-03-2025 01:29:37 AM
కరీంనగర్, మార్చి26 (విజయక్రాంతి): సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలు చాలా ఆరోగ్యకరమైనవని మరియు పోషకాలిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రైతు వారిది కేంద్రాన్ని నిర్వాహకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటున్నాడని ఆరోగ్యకరమైన వాతావరణ కల్పనకై కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఆరోగ్యకరమైన జీవిత కల్పనకై సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పలు పంటలను వినియోగించాలని తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటు వంటి అతిశయోక్తి లేదని చెప్పారు.
ప్రజలందరూ సేంద్రియ ఆహారాన్ని అలవాటుగా చేసుకోవా లని ముఖ్యంగా మిల్లెట్స్ చాలా క్రేజ్ ఉందని ఈ మిల్లెట్స్ ద్వారా చాలామందికి రోగ నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా మన ఆయుష్షును సైతం ప్రభావితం చేస్తున్నదని చెప్పారు.