కరీంనగర్: ఫుట్‌బాల్ క్రీడవిశ్వ క్రీడని, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందనసభకు ముఖ్యఅతిధిగా నరేందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో అల్ఫోర్స్ విద్యార్థులు 9వ తరగతికి చెందిన బి.సహస్ర రెడ్డి, 6వ తరగతికి చెందిన డి. సుస్మితా రెడ్డి అత్యుత్తమ ప్రదర్శనతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో జూలై 12, 13, 14వ తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం చాలా గొప్ప విషయమని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.