calender_icon.png 23 December, 2024 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారార్ విద్యార్థుల మద్దతు కోరిన అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి

13-09-2024 12:00:00 AM

కరీంనగర్ సిటీ, సెప్టెంబరు 12 : కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాలను అల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి గురువారం సందర్శించారు. పట్టభద్రు ల ఎమ్మెల్సీ బరిలో తనను బలపర్చాలని మద్దతు కోరారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను చదువుకున్న ఎస్సారార్ కళాశాలకు వచ్చి సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన మంజూరి గురించి ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.