కరీంనగర్, అక్టోబర్13(విజయక్రాంతి): క్రీడల ద్వారా విద్యార్థులకు చాలా మేలు చేస్తుందని మరియు వారిని వివిధ రంగాలలో అగ్రగామిగా కొనసాగినందుకు చేయూతనిస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొంది చదువులో రాణించి లక్ష్యాలను సాధించాలని కోరారు అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయలచే కళాశాలలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహింపబడి పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు కళాశాల స్థాయిలో అత్యుత్తమంగా ప్రవేశించిన విద్యార్థులు ఇటీవల కాలంలో ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ కొత్తపల్లిలో నిర్వహించబడిన అండర్ 19 జూనియర్ కళాశాల జిల్లాస్థాయి పోటీలలో కళాశాల చెందిన విద్యార్థినులు నెట్ బాల్ లో జి.ఎలిన జోన్న షారూన్ , ఎం రక్షిత హ్యాండ్ బాల్ లో జి.ఎలిన జోన్న షారూన్ ఎంపికయ్యారని హర్షం వ్యక్తం చేశారు.