కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఫిబ్రవరి 3 : నులిపురుగుల నివారణకు తప్పనిసరిగా ఆల్ఫెండజోల్ మాత్రమే వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో సోమవారం నులిపురుగుల నివారణకు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 10న అన్ని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలలో ఆల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. మిగిలిన వారికి 17వ తేదీన ఇవ్వాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,0,1560 మంది పిల్లలు గుర్తించడం జరిగిందని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారి నుండి మొదలు కొని ఆశా సిబ్బంది వరకు డి వార్మింగ్ డేలో భాగస్వాములు కావాలని ఆదేశించారు.
కడుపు లో నులిపురుగుల వలన రక్తహీనతను గురవుతారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెఓ కోటాచలం, డిఇఓ అశోక్, డి డబ్ల్యూ నరసింహారావు, ఏంటి ఈ పి డాక్టర్ నజియా, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రమాదేవి, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.