26-03-2025 01:40:37 AM
హుజూర్‌నగర్, మార్చి 25: హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం కోశాధికారి గా ఆలేటి వెంకట లక్ష్మి ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షురాళ్లు గా ఝన్సీ, జ్యోతి, రమాదేవి, సహాయ కార్యదర్శులు గా శ్యామల, మణి,పుష్ప, అనురాధ ను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమం లోసూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘము అధ్యక్షురాలు గరినే ఉమా శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి విజయలక్ష్మి పాండు, వంకాయల పద్మావతి, పొత్తుముత్తు సోమ లక్ష్మి, ఓరుగంటి నరసింహ రావు, గరినే శ్రీధర్, మాశెట్టి అనంతరాములు, బచ్చు రామారావు, పెండేల నాగరాజు, కరాల పాపారావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, ఓరుగంటి పాండుతదితరులు పాల్గొన్నారు.