calender_icon.png 25 October, 2024 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ అలర్ట్ జిల్లాల్లో ‘అలర్ట్’

02-09-2024 12:42:52 AM

చెరువులు, కుంటల రక్షణ చర్యలు చేపట్టండి

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): రాష్ర్టవ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహిం చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

సీఎం రేవం త్‌రెడ్డి వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హైడ్రాతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్‌కు వరద ముంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా లో మరో మూడు రోజులపాటు భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఏ ఒక్కరు విధులకు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని కలెక్టర్ నారాయ ణ రెడ్డి, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రజలు తక్షణ సహాయం కోసం 1800 4251442 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి సూచించారు.