14-02-2025 01:41:06 AM
ముంబై: టోల్ రహదారులపై టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల’ వ్యవధిని నిర్దేశించింది. నిర్దేశిత సమయంలో బాక్‌లిస్టులోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జనవరి 28నే ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్టులోకి వెళుతుంది. టోల్‌ప్ల్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ ఇన్యాక్టివ్‌లో ఉంటే కోడ్ 176 ఎ్రర్రర్‌ను చూపి లావాదేవీని తిరస్కరిస్తారు.