26-03-2025 10:16:20 PM
ఏఎస్పి చిత్తరంజన్...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మద్యపానం కుటుంబాలను నాశనం చేస్తుందని ఏఎస్పి చిత్తారంజన్ అన్నారు. బుధవారం కేరామేరి మండలం మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు లేండి గుడా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడగా తమ గ్రామస్తులు మద్యం కోసం పక్క గ్రామానికి వెళ్లి మద్యం సేవిస్తున్నారని తెలపడంతో ఏఎస్పీ వెంటనే బోలపటార్ గ్రామానికి వెళ్లి ఆకస్మికంగా దుకాణాలను తనిఖీ చేశారు. 56 దేశి బాటిల్లు లభ్యమయ్యాయి. దీంతో లేండి కూడా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో మద్యం సేవించడానికి నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు. 40 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత భవిష్యత్తు ను ఆలోచించి ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యతోనే సాధ్యమవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ, ఎస్సై విజయ్ తదితరులు ఉన్నారు.