calender_icon.png 18 April, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

10-04-2025 11:13:08 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం నాడు చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల నర్సింలు(35) కు గత 12 సంవత్సరాల క్రితం సవితతో వివాహం అయినది. ఆ దంపతులకి ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. గత కొన్ని రోజులుగా నర్సింలు మద్యానికి బానిసై ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు.

ఈ క్రమంలో ఏప్రిల్ 9వ తారీకు నాడు ఉదయం నర్సింలు భార్య సవిత తమ గ్రామానికి చెందిన వారి వివాహానికి ఎల్లారెడ్డికి పిల్లల్ని తీసుకొని వెళ్ళినదని, సవిత తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చి చూడగా నర్సింలు తన ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడని, అతని భార్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ మహేష్ తెలిపారు.