calender_icon.png 11 October, 2024 | 8:46 AM

అల్కరాజ్ x సిన్నర్

02-10-2024 12:00:00 AM

నేడు చైనా ఓపెన్ ఫైనల్

బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అల్కరాజ్ 7-5, 6-3తో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై విజయం నమోదు చేసుకున్నాడు. గంటన్నర పాటు సాగిన పోరులో అల్కరాజ్ కేవలం రెండు సెట్లలోనే మెద్వెదెవ్ ఆట కట్టించాడు. యూఎస్ ఓపెన్ అనంతరం అల్కరాజ్‌కు ఇది వరుసగా 8వ విజయం కావడం విశేషం.

మరో సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) 6-3, 7-6 (7/3)తో యున్‌చాకెటె బూ (చైనా)పై రెండు సెట్లలోనే విజయాన్ని సాధించాడు. ఈ ఇద్దరి మధ్య నేడు ఫైనల్ పోరు జరగనుంది.  మహిళల సింగిల్స్‌లో 15వ సీడ్ బడోసా ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జెస్సికాకు షాక్ ఇచ్చింది.

నాలుగో రౌండ్‌లో బడోసా 6-4, 6-0తో పెగులాపై సునాయాస విజయాన్ని అందుకుంది. మరో సింగిల్స్‌లో జాంగ్ (చైనా) 6-4, 6-2తో మగ్దలెనా ఫ్రెచ్ (పోలండ్)పై, యులియా స్టారోడుబ్ట్సేవా (ఉక్రెయిన్) 7-5, 6-0తో 10వ సీడ్ కలిన్‌స్క్యాపై విజయాలతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.