పారిస్: ఒలింపిక్స్‌లో స్పెయిన్ యువ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారాజ్ శుభారంభం చేశాడు. గ్రూప్ భాగంగా తొలి రౌండ్‌లో అల్కారాజ్ 6 6 హాడీ హబీబ్ (లెబనాన్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్‌లో మాథ్యూ ఎబ్డెన్ పై 6 4 మహిళల సింగిల్స్‌లో పోలండ్ భామ స్వియాటెక్ 6 7 బేగు (రొమెనియా)పై, ఇటలీ చిన్నది జాస్మిన్ పవోలిని 7 6 అనా బొగ్డన్ (రొమెనియా)పై విజయాలు సాధించి ముందంజ వేశారు. ఇక రెండో రౌండ్‌లో జొకోవిచ్ స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్‌ను ఎదుర్కొనే అవకాశముంది.