బీఆర్‌ఎస్ పాలనలో బతుకమ్మ ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎమ్మెల్సీ కవిత. పదేళ్ల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాగృతి పేరుతో ఉత్సవాలు నిర్వహించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారామె. అలాంటి కవిత కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత బతుకమ్మ ఉత్సవాలకు దూరమయ్యారు. తిహార్ జైలు నుంచి విడుదలై.. నెల రోజులైనా ఇప్పటివరకు ఆమె ఎక్కడ ఉందో? ఏం చేస్తుందో తెలియట్లేదు.
కవితక్క ఎప్పుడు వచ్చి బతుకమ్మ ఆడుతుందా? అని మహిళలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు వస్తుందని భావించినా అక్కడికి కూడా రాలేదు. బీఆర్‌ఎస్ శ్రేణుల్లో బతుకమ్మ వేడుకలు ప్రారంభమై నాటి నుంచి కవిత గురించి చర్చ సాగుతోంది.
భవిష్యత్తులో రాజకీయాల వైపు వస్తుందో? లేదోనని? పార్టీలో పదేళ్ల పాటు ఎదురులేని మహిళ నేతగా ఎదిగిన కవిత బీఆర్‌ఎస్ ఓటమి తరువాత కనుమరుగు కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారం వచ్చినప్పుడు ఎగిరిపడితే ఇలాంటి పరిస్థితులు తప్పవని ప్రజలు హితవు పలుకుతున్నారు.